
Coronavirus community transmission: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోప్జుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. దీంతో మహమ్మారి కట్టడికోసం స్థానిక అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. తాజాగా తిరువనంతపురం తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ఆ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన తిరువనంతపురం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను మూడు క్రిటికల్ కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభజించారు. ఆ మూడు జోన్‌లలో జూలై 18 అర్థరాత్రి నుంచి జూలై 28 వరకు పది రోజులపాటు కఠిన లాక్‌డౌన్ విధించినట్లు కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ 10 రోజులపాటు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలు వర్తించవని, కఠిన లాక్‌డౌన్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.
Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..