29ఏళ్ల కుర్రాడు బుకర్ ప్రైజ్ కొట్టేశాడు

|

Aug 27, 2020 | 6:42 PM

నెదర్లాండ్స్ కు చెందిన 29 ఏళ్ల మారికి లూకాస్ రీజ‌న‌వెల్డ్ ఈ ఏడాది ఇంట‌ర్నేష‌న‌ల్ బుకర్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు. 'ద డిస్‌కంఫ‌ర్ట్ ఆఫ్ ఈవింగ్' అనే పుస్త‌కానికి గాను ఈ పురస్కారం..

29ఏళ్ల కుర్రాడు బుకర్ ప్రైజ్ కొట్టేశాడు
Follow us on

నెదర్లాండ్స్ కు చెందిన 29 ఏళ్ల మారికి లూకాస్ రీజ‌న‌వెల్డ్ ఈ ఏడాది ఇంట‌ర్నేష‌న‌ల్ బుకర్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు. ‘ద డిస్‌కంఫ‌ర్ట్ ఆఫ్ ఈవింగ్’ అనే పుస్త‌కానికి గాను ఈ పురస్కారం లభించింది. ట్రాన్స్‌లేట‌ర్ మైఖేల్ హ‌ట్చిస‌న్ కూడా అవార్డులో భాగం పొందుతారు. ఫలితంగా 50 వేల పౌండ్ల ప్రైజ్‌మ‌నీ ఇద్ద‌రూ పంచుకుంటారు. నెద‌ర్లాండ్స్ గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ క‌థ‌కు బుకర్ ప్రైజ్ ప్యానెల్ ప‌ట్టంక‌ట్టింది. మొత్తంగా 30 భాష‌ల నుంచి అనువదించబడిన 124 పుస్త‌కాల‌ను ఈ అవార్డు కోసం జ‌డ్జిలు ప‌రిశీలించారు. ఒక సాంప్ర‌దాయ‌మైన క్రైస్త‌వ‌ వ్య‌వ‌సాయ కుటుంబానికి చెందిన క‌థ‌ను లూకాస్ రీజనవెల్డ్ త‌న ర‌చ‌న‌లో పొందుపరిచి విజేతగా నిలిచాడు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ అవార్డు ఫంక్షన్ ను ఫేస్‌బుక్‌, యూట్యూబ్ లైవ్ ప్ర‌జెంటేష‌న్ చేశారు.