సేతుపతి వెర్సెస్ దళపతి.. రచ్చహ.. రచ్చస్య… రచ్చోభ్యహ!

Thalapathy Vijay Vs Vijay Sethupathi: తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కూడా సూపర్ స్టార్లు..మరి అలాంటి స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తున్న ఊహే అద్భుతంగా ఉంటే.. సినిమా వస్తే ఇంకెంత అదిరిపోతోందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న […]

సేతుపతి వెర్సెస్ దళపతి.. రచ్చహ.. రచ్చస్య... రచ్చోభ్యహ!

Updated on: Jan 27, 2020 | 1:32 PM

Thalapathy Vijay Vs Vijay Sethupathi: తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కూడా సూపర్ స్టార్లు..మరి అలాంటి స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తున్న ఊహే అద్భుతంగా ఉంటే.. సినిమా వస్తే ఇంకెంత అదిరిపోతోందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మూడో లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘బాహుబలి’ పోస్టర్ మాదిరిగా దళపతి, సేతుపతి ఎదురెదురుగా ముఖాలపై గాయాలతో కనిపిస్తారు. ఇక ఈ మూవీలో విజయ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, చిత్ర యూనిట్ విడుదల చేసిన కొద్దిగంటల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

మాళవిక మొహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా, శాంత ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎక్స్‌బీ ఫిలిమ్‌ క్రియేషన్స్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా, సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us