AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హత్రాస్ లో ఇంకా ఉద్రిక్తత, భీమ్ ఆర్మీ చీఫ్ పై ఠాకూర్ల ఆగ్రహం

యూపీలోని హత్రాస్ లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. బాధిత యువతి హత్యాచారానికి బాధ్యులైన నలుగురు నిందితులకు మద్దతుగా అగ్రవర్ణాలవారు  బాహాటంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న హత్రాస్..

హత్రాస్ లో ఇంకా ఉద్రిక్తత, భీమ్ ఆర్మీ చీఫ్ పై ఠాకూర్ల ఆగ్రహం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 05, 2020 | 5:56 PM

Share

యూపీలోని హత్రాస్ లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. బాధిత యువతి హత్యాచారానికి బాధ్యులైన నలుగురు నిందితులకు మద్దతుగా అగ్రవర్ణాలవారు  బాహాటంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరుఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు. హత్రాస్ ఘటనపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ బదులు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలన్న ఆజాద్ వ్యాఖ్యను వారు తప్పు పడుతూ నువ్వు ఇక్కడికి రాజకీయాలు చేయడానికి వచ్చావా..నీచేత సీబీఐ విచారణకు ఎలా ఒప్పించాలో మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఎన్ని దెబ్బలైనా ఎదుర్కొనేందుకు ఠాకూర్లు రెడీగా ఉన్నారని, నీ ‘పెద్దన్నలు’ ఇక్కడే ఉన్నారని ఛాలెంజ్ చేశారు. నలుగురు అనుమానితుల అరెస్టుకు హత్రాస్ కుటంబానిదే బాధ్యత అని ఆ ఫ్యామిలీని కూడా పరోక్షంగా హెచ్ఛరించారు. ఈ కుటుంబానికి  ఇక్కడ ప్రాణహాని ఉందని చంద్రశేఖర్ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.’రాష్ట్రీయ సేవం పరిషద్’ పేరిట గల  ఈ గ్రూప్  ఠాకూర్లంతా హత్రాస్ కుటుంబాన్ని దుయ్యబట్టారు.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?