పెను విషాదం : పడవ బోల్తా పడి ఒకే కుటుంబంలోని 10 మంది మృతి

పాకిస్థాన్​లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. తట్టాలోని కీన్​ఝార్​ సరస్సులో ఓ పడవ బోల్తా పడి ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది చనిపోయారు.

పెను విషాదం : పడవ బోల్తా పడి ఒకే కుటుంబంలోని 10 మంది మృతి

Updated on: Aug 18, 2020 | 11:03 AM

పాకిస్థాన్​లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. తట్టాలోని కీన్​ఝార్​ సరస్సులో ఓ పడవ బోల్తా పడి ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

విహార యాత్ర కోసం కీన్​ఝార్​ సరస్సు ద‌గ్గ‌ర్లోని రిసార్టుకు వచ్చింది ఆ కుటుంబం. అక్కడే ఓ పడవ అద్దెకు తీసుకుని సరస్సులో విహ‌రిస్తుండ‌గా బలమైన గాలుల వ‌ల్ల‌ ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్ల‌డించారు. పడవలో 13 మంది ఉండగా ముగ్గురుని స్థానిక ఈతగాళ్లు రక్షించారు. 10 మంది డెడ్‌బాడీల‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read :

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

 

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌