తెలంగాణలో నేడు భారీ వర్షాలు

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు, మూడు రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.  బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 30నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు […]

తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Updated on: Jun 28, 2019 | 2:33 AM

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు, మూడు రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.  బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 30నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us