Telangana Crime News: ప్రియుడితో కలిసి సొంత నాయనమ్మ ఇంటిలోనే మనవరాలు ఏకంగా 18 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. ఈ ఘటన నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కేశవనగర్‌కు చెందిన డీజే ఆపరేటర్ పర్షా అజయ్(21), దమ్మాయిగూడలో నివాసముంటున్న పట్రిసియా(21)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. క్రమేపీ చెడు అలవాట్లకు బానిసైన అజయ్.. లాక్‌డౌన్ కారణంగా ఆర్ధికంగా ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలోనే పట్రిసియా ఇచ్చిన బంగారు గొలుసు అమ్మేశాడు. అయినా డబ్బులు సరిపోకపోవడంతో పట్రిసియా అమ్మమ్మ ఇంట్లో దొంగతనం చేయడానికి పక్కాగా ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగానే అక్టోబర్ 30న డిఫెన్స్ కాలనీలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ప్రియురాలిని పంపించాడు. వీరు అనుకున్నట్లుగానే అదే రోజు రాత్రి పట్రిసియా 18 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి అజయ్‌కు అప్పగించింది. వృద్దురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వృద్దురాలి మనవరాలు పట్రిసియా(21)ని నిందితురాలిగా గుర్తించడమే కాకుండా.. ఆమె తన ప్రియుడితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు.
Also Read: ఏపీ బాటలో తెలంగాణ.. ఇకపై పాఠశాలల్లో అడ్మిషన్లకు నో ‘టీసీ’.!