యాసంగి పంటలపై సీఎం కేసీఆర్ సమీక్ష

|

Oct 10, 2020 | 3:32 PM

రైతే రాజ్యానికి వెన్నుముక అని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతాంగానికి అధిక ప్రధాన్యత నిస్తున్నారు. ఇప్పటికే రైతుకు భరోసా కల్పిస్తూ పెట్టుబడి సాయంతో పాటు పంటల సాగు విధానంలో అధునిక పద్దతులను అలవాటు చేశారు.

యాసంగి పంటలపై సీఎం కేసీఆర్ సమీక్ష
Follow us on

రైతే రాజ్యానికి వెన్నుముక అని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతాంగానికి అధిక ప్రధాన్యత నిస్తున్నారు. ఇప్పటికే రైతుకు భరోసా కల్పిస్తూ పెట్టుబడి సాయంతో పాటు పంటల సాగు విధానంలో అధునిక పద్దతులను అలవాటు చేశారు. నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలోని బీడు బీములను సైతంగా సాగులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డుస్థాయిలో పంటసాగు చేయడంతో అందుకు తగ్గట్లు దిగుబడి కూడా పెరిగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వానా కాలంలో పంటల‌ కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

యాసంగి పంట సాగు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నదని, దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, శనివారం నాటి సమావేశంలో ఈ అంశంపైనా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కరోనా ముప్పు ఇంకా తొలుగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారు.. అలాగే వానకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లుచేయాలన్నారు. పంట కొనుగోళ్ల తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బు చెల్లించాలి. దీనికోసం కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.