నారా లోకేష్‌‌‌‌కు షాక్.. రెండోసారి భద్రత కుదింపు!

|

Feb 06, 2020 | 7:49 PM

TDP Leader Security: టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ భద్రతను మరోసారి ఏపీ ప్రభుత్వం కుదించింది. ముందుగా జెడ్ కేటగిరి నుంచి వై ప్లస్‌కి ఆయన భద్రతను తగ్గించిన ప్రభుత్వం తాజాగా వై ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చింది. గడిచిన ఎనిమిది నెలలలో లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించడం ఇది రెండోసారి. ఇక చినబాబు భద్రతను అకస్మాత్తుగా కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల నుంచి నారా లోకేష్‌కి ముప్పు […]

నారా లోకేష్‌‌‌‌కు షాక్.. రెండోసారి భద్రత కుదింపు!
Follow us on

TDP Leader Security: టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ భద్రతను మరోసారి ఏపీ ప్రభుత్వం కుదించింది. ముందుగా జెడ్ కేటగిరి నుంచి వై ప్లస్‌కి ఆయన భద్రతను తగ్గించిన ప్రభుత్వం తాజాగా వై ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చింది. గడిచిన ఎనిమిది నెలలలో లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించడం ఇది రెండోసారి.

ఇక చినబాబు భద్రతను అకస్మాత్తుగా కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల నుంచి నారా లోకేష్‌కి ముప్పు ఉందని గతంలోనే నిఘా సంస్థలు హెచ్చరించాయని.. నాడు జరిగిన ఏవోబీ ఎన్‌కౌంటర్ తరువాత లోకేష్‌ను అంతమొందిస్తామంటూ దొరికిన మావోయిస్టుల లేఖను కూడా వారు గుర్తుచేశారు. అంతేకాకుండా తన భద్రతలోని లోపాలను ప్రస్తావిస్తూ 8 సార్లు నారా లోకేష్ లేఖలు రాసినా.. ప్రభుత్వం నుంచి స్పందన ఏమి రాలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో శాసనమండలిని జగన్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయిలో జరగాల్సిన తంతు పూర్తైంది. మండలి రద్దును కేంద్రం ఇంకా ధృవీకరించనప్పటికీ.. రాష్ట్ర అధికారుల అభిప్రాయంలో నారా లోకేశ్ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ కిందనే లెక్క. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉన్న భద్రతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కుదించినట్లు తెలుస్తోంది.