తెలంగాణకు తమిళనాడు వరద సాయం..

|

Oct 19, 2020 | 4:41 PM

తెలంగాణను భారీ వర్షాలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై, సహాయకచర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎం పళనిస్వామి ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు...

తెలంగాణకు తమిళనాడు వరద సాయం..
Follow us on

Telangana Rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై, సహాయకచర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎం పళనిస్వామి ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రం త్వరితగతిన బయటపడాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టుగా తమిళనాడు సీఎం వెల్లడించారు. తెలంగాణకు రూ. 10 కోట్ల సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే మరే ఇతర సహాయం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

అయితే.. హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. వారం రోజులుగా నానుతున్న నగరంలో.. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ముందే అప్రమత్తం చేయడంతో మరింత భయపడిపోతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రమాదకరంగా మారాయి చెరువులు. పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వేలాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల్లో మైక్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు.