అనారోగ్యంతో తమిళ దర్శకుడు బాబు శివన్ మృతి

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ తమిళ దర్శకుడు బాబు శివన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

అనారోగ్యంతో తమిళ దర్శకుడు బాబు శివన్ మృతి

Updated on: Sep 18, 2020 | 11:02 AM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ తమిళ దర్శకుడు బాబు శివన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 54 ఏళ్లు. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘వేట్టైక్కారన్’‌ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బాబు తక్కువ కాలంలో మంచి గుర్తింపు పొందారు. విజయ్‌ హీరోగా ఏవీఎం సంస్థ నిర్మించిన ‘కురివి’ చిత్రానికి సంభాషణలు అందించారు. తదుపరి బుల్లి తెరపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. కాలేయం, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాబు శివన్‌ వైద్యం ఫలించక బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్‌ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us