Sushant Dream Project: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘చందమామ దూర్ కి’ త్వరలోనే పట్టాలెక్కనుంది. అంతరిక్షం నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సుశాంత్ స్నేహితుడు, దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ వెల్లడించాడు.
2017లో సుశాంత్ ఈ సినిమాలో చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పెద్ద సంచలనం సృష్టించింది. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ దీని గురించే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా కోసం సుశాంత్ నాసాలో శిక్షణ సైతం తీసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తొలిదశలోనే ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సంజయ్ పూరన్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాను కంప్లీట్ చేసి సుశాంత్‌కు అంకితమివ్వాలని సంజయ్ అనుకుంటున్నట్లు బీ-టౌన్‌లో వార్తలొస్తున్నాయి. మరి సుశాంత్ ప్లేస్‌లో ఏ హీరో నటిస్తాడో వేచి చూడాలి.?