ఓబుళాపురం గనుల దగ్గర ‘సర్వే ఆఫ్ ఇండియా’ రీ సర్వే

|

Oct 19, 2020 | 12:08 PM

అనంతపురంలోని ఓబుళాపురం గనుల దగ్గర సర్వే ఆఫ్ ఇండియా ఇవాళ రీ సర్వే చేపట్టింది. అక్రమ మైనింగ్‌తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, బళ్లారి కలెక్టర్ నకుల్ పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతోంది. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 చోట్ల పిల్లర్లు వేయాలని సర్వేఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది. […]

ఓబుళాపురం గనుల దగ్గర సర్వే ఆఫ్ ఇండియా రీ సర్వే
Follow us on

అనంతపురంలోని ఓబుళాపురం గనుల దగ్గర సర్వే ఆఫ్ ఇండియా ఇవాళ రీ సర్వే చేపట్టింది. అక్రమ మైనింగ్‌తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, బళ్లారి కలెక్టర్ నకుల్ పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతోంది. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 చోట్ల పిల్లర్లు వేయాలని సర్వేఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది. గాలి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ కారణంగా ఓబుళాపురం గనుల్లో సరిహద్దు వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. గాలి జనార్ధనరెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీ మైనింగ్ చేసిన గనుల వద్ద ముఖ్యంగా ఈ సర్వే చేస్తున్నారు అధికారులు. వందేళ్ల నాటి గెజెట్లు, భూ పటాలు, రికార్డులను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు.