కోర్టునే అనుమానించే విధంగా వ్యవహరిస్తున్నారు, కేంద్రంపై సీజేఐ బాబ్డే ఆగ్రహం, రైతు సంఘాలకూ నోటీసులు

రైతు చట్టాలపై తాము ఏర్పాటు చేసిన కమిటీని అనుమానించే విధంగా కేంద్రం ప్రవర్తిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కమిటీ పట్ల తాము పక్షపాత పూరితంగా..

  • Umakanth Rao
  • Publish Date - 2:17 pm, Wed, 20 January 21
కోర్టునే అనుమానించే విధంగా వ్యవహరిస్తున్నారు, కేంద్రంపై సీజేఐ బాబ్డే ఆగ్రహం, రైతు సంఘాలకూ నోటీసులు

రైతు చట్టాలపై తాము ఏర్పాటు చేసిన కమిటీని అనుమానించే విధంగా కేంద్రం ప్రవర్తిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కమిటీ పట్ల తాము పక్షపాత పూరితంగా వ్యవహరిస్తున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారని సీజేఐ బాబ్డే విమర్శించారు. కమిటీలోని సభ్యులు జడ్జీలు కారని, ఒకరు వైదొలగినంత మాత్రాన కమిటీ అభిప్రాయాలు మారబోవని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయన్నారు. కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని లేదా పునర్వ్యవస్థీకరించాలని చేసిన సూచనలపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీరు మాకు నేర్పేంతవారయ్యారా అన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. మరో వైపు రైతు సంఘాల తీరు పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ర్యాలీపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్రం లేదా ఢిల్లీ పోలీసులే అన్నారు. కాగా కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.