‘పాక్ విద్యార్థులూ.. అక్కడే ఉండండి..’: పాకిస్తాన్ రాయబారి

| Edited By:

Feb 02, 2020 | 4:46 PM

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని వణికిస్తుంది. భారత్ ఇప్పటికే చైనాలోని భారతీయులను తరలించేందుకు రెండు ప్రత్యేక విమానాలను పంపించింది. ఈ నేపథ్యంలో చైనాలోని పాక్ విద్యార్థులు కూడా త్వరగా తమ దేశం వెళ్లాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చైనాలోని పాక్ రాయబారి నగ్మనా హష్మీ.. పాక్ విద్యార్థుల ఆశల్ని వమ్ము చేస్తూ సంచలన ప్రకటన చేశారు. చైనాలో ఉన్న పాక్ విద్యార్థులు ప్రస్తుతానికి అక్కడే ఉండాలని సూచించారు. ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ […]

‘పాక్ విద్యార్థులూ.. అక్కడే ఉండండి..’: పాకిస్తాన్ రాయబారి
Follow us on

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని వణికిస్తుంది. భారత్ ఇప్పటికే చైనాలోని భారతీయులను తరలించేందుకు రెండు ప్రత్యేక విమానాలను పంపించింది. ఈ నేపథ్యంలో చైనాలోని పాక్ విద్యార్థులు కూడా త్వరగా తమ దేశం వెళ్లాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చైనాలోని పాక్ రాయబారి నగ్మనా హష్మీ.. పాక్ విద్యార్థుల ఆశల్ని వమ్ము చేస్తూ సంచలన ప్రకటన చేశారు. చైనాలో ఉన్న పాక్ విద్యార్థులు ప్రస్తుతానికి అక్కడే ఉండాలని సూచించారు.

ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే.. పాక్‌లో వైద్య సదుపాయాలు కరోనా కట్టడికి అవసరమైన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, ఈ విషయంలో చైనాయే బెటర్ అని ఆమె స్పష్టం చేశారు. వూహాన్ నగరంలోనే పాక్ విద్యార్థులకు మంచి వైద్యం అందుతుందని తెలిపారు. కాగా.. పాక్ నేషనల్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘మా పౌరుల క్షేమం దృష్టిలో పెట్టుకునే ఇలా సూచిస్తున్నాం. ఈ నిర్ణయం ఒక్క పాక్ పౌరులకే కాకుండా యావత్ దక్షిణాసియాకు లాభించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాలోని పాక్ పౌరులను అక్కడే ఉండనివ్వడం అందరికీ శ్రేయస్కరం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపత్యంలో పాక్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.