భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్‌స్మిత్(81)ను భారత స్పిన్నర ఆర్ అశ్విన్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఆసీస్ సగం వికెట్లను కోల్పోయింది. కాగా, క్రీజులో కామెరాన్ గ్రీన్(44), టిమ్ పైన్(29) క్రీజులో ఉన్నాడు. 79 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 258/5గా ఉంది. ప్రస్తుతం ఆసీస్ 352 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా సైనీ, అశ్విన్‌కు తలా రెండు వికెట్ లభించాయి. సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది.
Also Read: Steven Smith: హాఫ్ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్… ఆసీస్ స్కోర్ 182/4… 276 పరుగుల ఆధిక్యం….