Steven Smith: హాఫ్ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్… ఆసీస్ స్కోర్ 182/4… 276 పరుగుల ఆధిక్యం….

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌(56) హాఫ్ సెంచరీ సాధించాడు....

Steven Smith: హాఫ్ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్... ఆసీస్ స్కోర్ 182/4... 276 పరుగుల ఆధిక్యం....
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2021 | 9:05 AM

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌(56) హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, క్రీజులో స్మిత్‌తో పాటు కామెరాన్‌ గ్రీన్‌(14) ఉన్నాడు. 64 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 182/4గా నమోదైంది. అంతకుముందు 103/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. లబుషేన్‌(73), మాథ్యూవేడ్‌(4) ఔటయ్యారు. ప్రస్తుతం ఆసీస్‌ 276 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా సైనీకి రెండు వికెట్లు, సిరాజ్, అశ్విన్‌కు తలా ఒక వికెట్ లభించింది.

Also Read: Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ