ప్రదీప్‌ను దాటేసిన శ్రీముఖి.. రేటింగ్స్‌లో ముందంజ!

యాంకర్లు శ్రీముఖి, ప్రదీప్‌ల కమ్ బ్యాక్ షోలు ‘స్టార్ మ్యూజిక్ రీలోడెడ్’, ‘లోకల్ గ్యాంగ్స్’ల ఆరంభం అదిరిందని లేటెస్ట్‌గా విడుదలైన టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. బిగ్ బాస్ తర్వాత కొద్దిరోజులు వెకేషన్ చేసి.. ‘స్టార్ మ్యూజిక్ రీలోడెడ్’ గేమ్ షో ద్వారా బుల్లితెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి తనదైన యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకుంటోంది. ఆమె హోస్ట్ చేస్తున్న గేమ్ షో గురువారం, శుక్రవారం, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఇక తాజా టీఆర్పీ […]

ప్రదీప్‌ను దాటేసిన శ్రీముఖి.. రేటింగ్స్‌లో ముందంజ!

Updated on: Dec 16, 2019 | 6:12 AM

యాంకర్లు శ్రీముఖి, ప్రదీప్‌ల కమ్ బ్యాక్ షోలు ‘స్టార్ మ్యూజిక్ రీలోడెడ్’, ‘లోకల్ గ్యాంగ్స్’ల ఆరంభం అదిరిందని లేటెస్ట్‌గా విడుదలైన టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. బిగ్ బాస్ తర్వాత కొద్దిరోజులు వెకేషన్ చేసి.. ‘స్టార్ మ్యూజిక్ రీలోడెడ్’ గేమ్ షో ద్వారా బుల్లితెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి తనదైన యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకుంటోంది. ఆమె హోస్ట్ చేస్తున్న గేమ్ షో గురువారం, శుక్రవారం, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఇక తాజా టీఆర్పీ రేటింగ్స్ బట్టి చూస్తుంటే.. శ్రీముఖి షోకు మంచి నెంబర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్న ‘లోకల్ గ్యాంగ్స్’ షో ప్రతి శనివారం జీ తెలుగులో ప్రసారమవుతోంది. యాంకర్ రవి, తేజస్విలు టీమ్ లీడర్లుగా ఉన్న ఈ షోకు.. అనసూయ, జానీ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ మంచి టీఆర్పీలను దక్కించుకోగా.. మొదటి ఎపిసోడ్‌కు అది కాస్తా యావరేజ్ నెంబర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా, టాప్ 5 లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. వంటలక్క ‘కార్తీక దీపం’ ఎప్పటిలానే టాప్‌లో ఉండగా వదినమ్మ, గోరింటాకు, మౌనరాగం, ఈటీవీ న్యూస్ ప్రోగ్రాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.