2 / 5
కోవిడ్ నిబంధనల నడుమ భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. ఈ కమనీయ వేడుకను అశేష జనవాహిని పలు తెలివిజన్ల ద్వారా వీక్షించారు. సీతారాముల కల్యాణాన్ని గాంచిన రామ భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు.