శ్రీలంకలో అర్థరాత్రి నుంచి ఎమర్జన్సీ ప్రకటించారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. ఆదివారం జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైన్యం మోహరించింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోదాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దాడుల వెనుక నేషనల్ తవ్హీద్ జమాత్ అనే సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని శ్రీలంక మంత్రి సేనరత్నే తెలిపారు. దాడుల్లో మొత్తం ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని, వారంతా తమ దేశపౌరులేనని వెల్లడించింది శ్రీలంక ప్రభుత్వం. కాగా.. ఇప్పటివరకూ 295 మంది చనిపోగా, 500ల మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నారు.