ఎస్పీబీ లేటెస్ట్ హెల్త్ బులిటెన్…

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో విడుదల చేశారు.

ఎస్పీబీ లేటెస్ట్ హెల్త్ బులిటెన్...

Edited By:

Updated on: Sep 10, 2020 | 9:04 PM

SPB Health Update: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో విడుదల చేశారు. ”నాన్నగారికి ప్రస్తుతం వెంటిలేటర్ సహాయంతో ఎక్మో థెరపీ ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది.. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని” ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

నాన్నగారికి ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ జరుగుతున్నట్టు.. అలాగే ఆయన డిశ్చార్జ్ అయినట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా అవాస్తవమేనని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. దయచేసి ఎవరూ తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. నాన్నగారి ఆరోగ్యంపై పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తానే చెబుతానని ఎస్పీ చరణ్ వెల్లడించారు.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..