దక్షిణ కొరియాలో పెరుగుతున్న కరోనా.. మూతపడ్డ పాఠశాలలు

|

Aug 25, 2020 | 3:52 PM

మొదటి నుంచి కరోనా కట్టడిలో ముందు వరుసలో దక్షిణ కొరియాలో ఇప్పడిప్పుడే కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ విధించి, ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేవాలు జారీ చేసింది.

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కరోనా.. మూతపడ్డ పాఠశాలలు
Follow us on

మొదటి నుంచి కరోనా కట్టడిలో ముందు వరుసలో దక్షిణ కొరియాలో ఇప్పడిప్పుడే కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ విధించి, ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేవాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆ దేశ రాజధాని సియోల్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా పాఠశాలలను మూసివేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులను బోధించాలని సర్కార్ ఆదేశించింది. గత రెండు వారాల్లో ఎక్కువ మంది సియోల్ ప్రాంతంలో కనీసం 150 మంది విద్యార్థులు, 43 మంది పాఠశాల సిబ్బంది కొవిడ్ పాజిటివ్ పరీక్షలు చేసినట్లు విద్యా మంత్రి యూ యున్-హే ఒక బ్రీఫింగ్కు తెలిపారు. దీంతో సియోల్, ఇంచియాన్ ,జియోంగ్గి ప్రావిన్స్ నగరాల్లో విద్యార్థులందరూ సెప్టెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడం జరుగుందన్నారు విద్యా మంత్రి.

కాగా, ఆ దేశంలో కొత్తగా 280 మందికి కరోనా వైరస్ సోకినట్లు కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 17,945 మంది కొవిడ్ బారినపడినట్లు తెలిపింది. ఇక దేశంలో కరోనా బారినపడి 310 మరణాలను కోల్పోయినట్లు వెల్లడించింది. ఇక, కొత్త కేసులు జనసాంద్రత ఎక్కువ కలిగిన రాజధాని ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండటంతో, దేశం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఆందోళన వ్యక్తం చేశారు ఆరోగ్య అధికారులు. ప్రజలు ఇంటి వద్దే ఉండి ప్రయాణాన్ని పరిమితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత వారంతో పోలిస్తే ఈ వారం మూడు రెట్లు ఎక్కువ తీవ్రమైన కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక మరోవైపు దక్షిణ కొరియా ప్రభుత్వం మొదటిసారిగా బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించాలని ఆదేశించింది. చర్చిలు, నైట్‌క్లబ్‌లు, కచేరీ బార్లు, ఇతర అధిక ప్రమాద వేదికలను మూసివేయాలని ఆదేశించింది. అటు, సెలవుల్లో ఉన్న వేలాది మంది వైద్యులను తిరిగి పనికి రావాలని ఆరోగ్య మంత్రి పార్క్ న్యూంగ్-హూ విజ్ఞప్తి చేశారు.