
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. నాడు దాదా తనకు అండగా నిలిచాడు కాబట్టే తాను భారత్ తరపున ఇంతకాలం క్రికెట్ ఆడానని అన్నాడు. ఆ సమయంలో సెలెక్టర్లు తనని జట్టులోకి తీసుకోవద్దన్నారని.. ఎన్నో మాటలన్నారని చెప్పిన హర్భజన్.. దాదా ఎల్లప్పుడూ కూడా తనకు అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు.
దాదా మద్దతుతోనే భారత్ తరపున 100 టెస్టులు ఆడానని భజ్జీ తెలిపాడు. తాను చెప్పిన విధంగానే ఫీల్డింగ్ ఏర్పాటు చేసి, తనలో ఎప్పుడూ ధైర్యాన్ని పెంచి.. ఉత్తమ బౌలర్ గా, మేటి స్పిన్నర్ గా గంగూలీ తనని మార్చాడని హర్భజన్ సింగ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన చాట్ లో వివరించాడు.