Sourav Ganguly Health: గంగూలీ హెల్త్ అప్‌డేట్.. డిశ్చార్జ్ డేట్‌లో మార్పు.. మళ్లీ ఎప్పుడంటే.!

Sourav Ganguly Health: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలైంది...

Sourav Ganguly Health: గంగూలీ హెల్త్ అప్‌డేట్.. డిశ్చార్జ్ డేట్‌లో మార్పు.. మళ్లీ ఎప్పుడంటే.!
Sourav Ganguly Health Updates

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 4:59 PM

Sourav Ganguly Health: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఆయనను గురువారం డిశ్చార్జ్ చేస్తామని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

”ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఇవాళ కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతారు. రేపు(గురువారం) డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా డాక్టర్లు చర్చిస్తున్నారు” అని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

అయితే తొలుత దాదాను బుధవారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు స్పష్టం చేయడం.. మళ్లీ ఇప్పుడు ఆయనకు ఇవాళ కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పడంతో అభిమానులు కాసింత ఆందోళన చెందుతున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ నేపధ్యంలో గంగూలీ డిశ్చార్జ్ అయిన అనంతరం వరుసపెట్టి రాజకీయ నాయకులు ఆయన ఇంటి బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read:

కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!