Sonu Sood Request: కష్టాల్లో ఉన్నవారికి చేయూతను ఇస్తూ ఎంతోమంది పేదవారికి నటుడు సోనూసూద్ ఆర్ధిక సాయం అందించారు. లాక్‌డౌన్ సయమంలో వలస కార్మికులను, విద్యార్దులను వారి స్వస్థలాలకు చేర్చి యావత్ భారతదేశానికి రియల్ హీరో అనిపించుకున్నారు. దీనితో సోనూసూద్ గొప్ప మనసుకు ఎంతోమంది అభిమానులు అయ్యారు.
కొందరు అయితే అతడికి గుడి కట్టి మరీ దేవుడిగా కొలుస్తున్నారు. ఇక తాజాగా ఓ తెలుగు అభిమాని అయితే సోనూ మీద ఇష్టంతో అతడి పేరును చేతిపై టాటూ కూడా వేయించుకున్నాడు. ‘మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే’ అనే పాటతో వీడియో చేసి సోనూకు ట్వీట్ చేశాడు. దీనిపై నటుడు సోనూసూద్ స్పందించాడు. బ్రదర్.! దయ చేసి టాటూలు వేయించుకోవద్దు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అది చూపించేందుకు మీరు ఈ నొప్పిని భరించకండి అని విజ్ఞప్తి చేస్తూ రీ-ట్వీట్ చేశాడు.
Brother, please don’t make tattoos ? I know you love me but to show your love you don’t need to go through this pain ❤️? https://t.co/aSj8KhykSL
— sonu sood (@SonuSood) January 10, 2021