వలస కూలీల దేవుడికి అరుదైన గౌరవం

|

Oct 21, 2020 | 11:47 PM

రియల్ హీరో సోనూ సుద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన విలన్ కాదు రియల్‌ హీరోగా మారిపోయాడు...

వలస కూలీల దేవుడికి అరుదైన గౌరవం
Follow us on

Sonu Sood Won : రియల్ హీరో సోనూ సుద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన విలన్ కాదు రియల్‌ హీరోగా మారిపోయాడు. ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి చేయూతనిచ్చిన ఆయనను కోల్‌కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించారు.

ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్‌లో సోనూ సూద్‌ విగ్రహాన్ని ప్రదర్శించి ఇలా ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అది చూసిన సోనూ సూద్‌ స్పందిస్తూ… ఇది తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అంటూ అనందం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ట్వీట్‌ చేస్తూ.. ‘ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్‌ చేశారు. అదే విధంగా కెష్టోపర్‌ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.


అయితే లాక్‌డౌన్‌లో సోనూ సూద్‌ వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చడంతో పాటు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సైతం స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.