ఫించన్ డబ్బుల కోసం కసాయి కొడుకు దాష్టీకం

సమాజంలో రాను రానూ మానవత్వం మంటగలుస్తోంది. కన్న తండ్రి అన్న కనికరంలేని ఓ కసాయి ఫించన్ డబ్బుల కోసం హతమార్చాడు.

ఫించన్ డబ్బుల కోసం కసాయి కొడుకు దాష్టీకం

Updated on: Jun 11, 2020 | 1:46 PM

సమాజంలో రాను రానూ మానవత్వం మంటగలుస్తోంది. కన్న తండ్రి అన్న కనికరంలేని ఓ కసాయి ఫించన్ డబ్బుల కోసం హతమార్చాడు.
వికారాబాద్‌ : జిల్లాలోని పూడూర్‌ మండలం సోమన్‌గుర్తి గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. వ్యసనాలకు అలవాటు పడి.. పింఛన్‌ డబ్బుల కోసం కన్నతండ్రిని కొడుకు హతమార్చాడు. పెన్షన్‌ డబ్బులు ఇవ్వలేదని తండ్రి రాములు(70)ను కొడుకు వెంకటయ్య(32) గొంతు నులిమి చంపాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.