Bigg Boss-4: హుస్నాబాద్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఘన స్వాగతం.. అభిమానులతో ముచ్చటించిన సోహైల్‌..

|

Dec 27, 2020 | 10:17 AM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 సెకండ్ రన్నర్‌గా నిలిచిన సోహైల్‌కు హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన శైలితో ఆకట్టుకున్న

Bigg Boss-4: హుస్నాబాద్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఘన స్వాగతం.. అభిమానులతో ముచ్చటించిన సోహైల్‌..
Follow us on

Bigg Boss-4 : బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 సెకండ్ రన్నర్‌గా నిలిచిన సోహైల్‌కు హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన శైలితో ఆకట్టుకున్న సోహైల్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్‌కు ముందు చాలా సినిమాల్లో నటించిన సోహైల్‌కు అవేమీ గుర్తింపునివ్వలేదు కానీ బిగ్‌ బాస్‌ తర్వాత చాలామంది ఫాలోవర్స్‌ పెరిగారు.

అయితే సోహైల్ వరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళుతుండగా పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్‌కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్‌ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్‌ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్‌ వరంగల్‌ నుంచి హుస్నాబాద్‌ మీదుగా వెళ్లేందుకు పయనమయ్యాడు. అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్‌ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో సోహైల్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సోహైల్ ఇటీవల ఓ సినిమాను కూడా ప్రకటించారు.