
స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతీ చిన్న పనికి స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దలకే కాకుండా చిన్నారులు కూడా ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. పెద్దలు కూడా చిన్నారుల మారాం చేస్తున్నారని చేతిలో ఫోన్‌లు పెడుతున్నారు. అయితే దీనివల్ల ఎన్నో రకాల ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
అధికంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే చిన్నారుల్లో మయోపియా అనే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో పాఠశాలకు వెళ్లే పిల్లలలో 13% కంటే ఎక్కువ మంది మయోపియా సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మయోపియా అంటే.. దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం. గడిచిన 10 ఏళ్లలో ఈ సమస్య రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మయోపియ సమస్యలో చిన్నారులు దూరంగా ఉండే వస్తువులను చూసే శక్తిని కోల్పోతారు. ఇది సాధారణంగా బాల్యంలో అభివృద్ధి చెంది, వయస్సుతో పెరుగుతుంది. తీవ్రమైన మయోపియా రెటీనా సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు గణంకాలు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సులభంగా యాక్సెస్ చేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడాంటే పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లలు ఎక్కువ సమయం బయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. మయోపియాను నివారించడంలో సూర్యరశ్మి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించాలి. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మయోపియా సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం 2050 నాటికి, ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు మయోపియాతో బాధపడవచ్చుని అంచనా వేస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..