లొంగుబాటే శివసేన బాట..వేరే దారేది ?

చాలా సింపుల్‌గా జరిగిపోవాల్సిన మహరాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు.. శివసేన డిమాండ్లతో జఠిలమైంది. పరిపూర్ణ మెజారిటీ వచ్చినందున బిజెపి-శివసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సులభంగా ఏర్పాటయ్యేది. కానీ విపరీతమైన అన్ సర్టెనిటీ వచ్చేసింది. హర్యానాలో మెజారిటీ లేకపోయినా.. ఎన్నికలకు ముందు జెజెపితో ఎలాంటి అవగాహన లేకపోయినా.. 24 గంటల్లో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు నుంచే అవగాహన వున్నప్పటికీ ఫలితాలు వెల్లడై వారం గడుస్తున్నా శివసేన-బిజెపి పార్టీల సంకీర్ణ సర్కార్ ఏర్పాటులో ఇంకా […]

లొంగుబాటే శివసేన బాట..వేరే దారేది ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 30, 2019 | 3:34 PM

చాలా సింపుల్‌గా జరిగిపోవాల్సిన మహరాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు.. శివసేన డిమాండ్లతో జఠిలమైంది. పరిపూర్ణ మెజారిటీ వచ్చినందున బిజెపి-శివసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సులభంగా ఏర్పాటయ్యేది. కానీ విపరీతమైన అన్ సర్టెనిటీ వచ్చేసింది. హర్యానాలో మెజారిటీ లేకపోయినా.. ఎన్నికలకు ముందు జెజెపితో ఎలాంటి అవగాహన లేకపోయినా.. 24 గంటల్లో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు నుంచే అవగాహన వున్నప్పటికీ ఫలితాలు వెల్లడై వారం గడుస్తున్నా శివసేన-బిజెపి పార్టీల సంకీర్ణ సర్కార్ ఏర్పాటులో ఇంకా అన్ సర్టెనిటీ కొనసాగుతోంది.
ఈ అన్ సర్టెనిటీతో నష్టాలే కానీ లాభాలు లేవు. మంచి కంటే చెడే ఎక్కువ. కానీ సమస్య వున్న చోటే పరిష్కారం వుంటుంది. శివసేన డిమాండ్లతో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా అన్న సందేహం వ్యక్తమైంది. కానీ ఇపుడు ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాల్సిన దశ వచ్చేసింది. శుక్రవారం డెడ్‌లైన్‌గా కనిపిస్తోంది. దాంతో శివసేన త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. శుక్రవారం సిట్టింగ్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో మహా సంక్షోభ నివారణకు నాలుగు పరిష్కారాలు కనిపిస్తున్నాయి.
తొలి ప్రాధాన్యం ప్రకారం.. శివసేన ఎటూ తేల్చకపోతే బిజెపి.. తనకు మద్దతిస్తున్న ఇండిపెండెంట్ల జాబితాతో గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం. దీనికి గవర్నర్ ఈజీగానే అంగీకరించే పరిస్థితి వుంది. అప్పుడు శివసేనకు మెత్తబడడమో లేక ఎదురు తిరగడమో రెండే అవకాశాలుంటాయి.
ఇక రెండో ఆప్షన్.. శివసేన ముఖ్యమంత్రి పీఠం పంచుకునే డిమాండ్‌ని పక్కన పెట్టి.. మంత్రివర్గంలో తగిన వాటాతో సంత‌ృప్తి పడడం. ఎందుకంటే శివసేనకు దిగిరావడం తప్ప మరో మార్గం లేదు. బెదిరింపులు ఓకే కానీ కాంగ్రెస్ పార్టీతో శివసేన కల్వడం దాదాపు అసాధ్యం. రాజకీయ దిగ్గజాలు, మాజీ ముఖ్యమంత్రులు వున్న కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపే స్థాయి వ్యక్తి శివసేనలో లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మంతనాలు అసాధ్యమనే చెప్పాలి. నిజానికి ఈ పరిస్థితి బాల్ థాక్రే బతికున్న కాలం నుంచి వుంది.
మూడో ఆప్షన్…కాంగ్రెస్, ఎన్సీపీలతో మద్దతు లేఖలను తీసుకుని, శివసేన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఇది లీగల్‌గా ఓకే కానీ.. ప్రాక్టికల్‌గా అంత సులభం కాదు. ఈ ప్రతిపాదన వినేందుకు బాగానే వున్నా ప్రాక్టికల్‌గా ఆచరణకు ఎన్నో అడ్డంకులున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు చొరవ చూపే నాయకుడే లేరు. అందుకే ఇది కూడా ఆచరణసాధ్యం కాదనే నా అభిప్రాయం.
ఇక మిగిలింది నాలుగో ఆప్షన్.. ముందుగా ఎన్సీపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత శివసేన పార్టీ అందులో చేరడం. అయితే.. ఇందుకు తాము సిద్దంగా వున్నట్లు ఎన్సీపీ ప్రకటించలేదు కాబ్టటి దీని అవకాశాలు కూడా అంతంత మాత్రమేనని చెప్పాలి. దేవేంద్ర ఫడ్నవీస్‌పై వ్యతిరేకతలో ఈ మూడు పార్టీలకు సమీప్యత వుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నదే ప్రశ్న.
పరిస్థితిని గమనిస్తే.. శివసేన లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీకి ఎన్డీయే నుంచి బయటికి రావడం అంత సులభం కాదు. గత ముప్పై ఏళ్ళుగా బిజెపి మద్దతుతో ముంబయి నగర మేయర్ పదవిని శివసేన పొందుతూ వస్తుంది. ఒకవేళ బిజెపితో వైరం కోరుకుంటూ ముందుగా ముంబయి నగర మేయర్ గిరి శివసేన చేజారిపోతుంది. అందువల్ల తెగేదాకా లాగే ధోరణి శివసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ అల్లరి కూడా శివసేనకు ఇబ్బందికరంగా మారుతుంది.
నిజానికి ప్రభుత్వం ఏర్పాటైనా తమ చేతుల్లోనే రిమోట్ వుంటుందంటూ శివసేన నేతలు చేసిన కామెంట్లు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. 288 సీట్లున్న మహారాష్ట్రలో శివసేన కేవలం 56 సీట్లకే పరిమితమైంది. అందువల్ల శివసేనకు లొంగిపోవాల్సిన పరిస్థితే ఎక్కువ. బిజెపి కూడా శివసేన అడిగిన హోం, రెవెన్యూ, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలను శివసేనకు ఇవ్వకపోవచ్చు.
మహారాష్ట్రలో ఆసక్తికరమైన డ్రామా కొనసాగింది కానీ.. శివసేన కోరికలు మాత్రం తీరతాయని అనుకోవడం లేదు. బిజెపి మాటే చెల్లుబాటు అవుతుంది. కేంద్రంలో తమ ప్రభుత్వం వుండడం, ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో బిజెపికి మద్దతు ప్రకటించడం బిజెపికి అనుకూలాంశాలు. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో అంటే గురువారం నాటికి శివసేన ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి. తేల్చలేకపోతే.. బిజెపికి అనుకూల పరిస్థితిని తనకు తానే కల్పించినట్లు అవుతుంది.
Disclaimer:ఈ ఆర్టికల్ లోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు .. వీటితో టీవీ 9 కి గానీ, టీవీ 9 వెబ్ సైట్ తో గానీ ఎలాంటి సంబంధం లేదని మనవి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో