Sanchaita Gajapatiraju: జగన్ సర్కార్‌లో సంచయితకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?

Simhachalam Chair Person Sanchaita Gajapatiraju: సంచయిత గజపతిరాజు.. ఏపీలో ఈ పేరు తెలిసినవాళ్లు పెద్దగా ఉండరు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం ఈమె సుపరిచితమే. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఈమె సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఇంతకీ ఈమె ఎవరో కాదు.. కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడి కుమార్తె.. ఆనంద్ గజపతిరాజు, సుధాల రెండో కుమార్తె సంచయిత గజపతిరాజు. ఢిల్లీలో ఉండే […]

Sanchaita Gajapatiraju: జగన్ సర్కార్‌లో సంచయితకు కీలక స్థానం...? ఇంతకీ ఎవరామె..?
Follow us

|

Updated on: Mar 06, 2020 | 2:11 PM

Simhachalam Chair Person Sanchaita Gajapatiraju: సంచయిత గజపతిరాజు.. ఏపీలో ఈ పేరు తెలిసినవాళ్లు పెద్దగా ఉండరు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం ఈమె సుపరిచితమే. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఈమె సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఇంతకీ ఈమె ఎవరో కాదు.. కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడి కుమార్తె.. ఆనంద్ గజపతిరాజు, సుధాల రెండో కుమార్తె సంచయిత గజపతిరాజు. ఢిల్లీలో ఉండే ఈమె బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఓ ఎన్‌జీవో ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ (మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌) ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఉదయం ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈ పదవిని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన తొలగించి.. జగన్ సర్కార్ సంచయితను ఎంపిక చేయడంతో ఇప్పుడు సంచలనమైంది.

కాగా, 1958లో ఈ ట్రస్ట్‌ను నెలకొల్పగా.. పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత ఆయన మరణానంతరం 1994లో పెద్ద కుమారుడు ఆనంద్ గజపతిరాజు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2016లో అశోక్ గజపతిరాజు ఈ పదవిలో కొనసాగారు. కాగా, ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ట్రస్ట్ బాధ్యతలను చేపట్టిన తొలి మహిళగా సంచయిత రికార్డు సృష్టించారు.అయితే జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

For More News: 

కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?

ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!

నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..

హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు

భారతీయులకు అభయం.. ఆ టాబ్లెట్‌తో కరోనా ఖేల్ ఖతం!

ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…