బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి.. ఇవాళ మళ్లీ పెరిగింది. ఇక రెండు రోజులుగా వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. ఆదివారం వెండి ధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో సిల్వర్ రేటు రూ.800 పెరిగి.. కిలో వెండి ధర రూ.70,000కు చేరింది.
బులియన్ మార్కెట్లో వెండి ధరలు పెరగడంతో దేశంలోని పలు నగరాల్లోని మార్కెట్లలో వెండి ధరలలో మార్పులు జరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.74,600 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కిలో వెండి రూ. 74,600కు చేరింది. ఇక ముంబైలో కిలో వెండి రూ.70,000 కొనసాగుతుండగా.. చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.74,600 దగ్గర ఉంది. ఇక ఢిల్లీలో మాత్రం కిలో వెండి రూ.70,000 ఉంది.
Also Read:
Gold Price In India: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ధర ఎంతంటే ?