కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కోర్టుకెక్కిన షూటర్ వర్తికా సింగ్, ఫేక్ లెటర్ పంపి లంచం కోరారని ఆరోపణ, 2 న విచారణ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పైన, ఆమె ఇద్దరు సన్నిహితులపైన షూటర్ వర్తికా  సింగ్ కోర్టుకెక్కింది. జాతీయ మహిళా కమిషన్ లో నిన్ను సభ్యురాలిని చేస్తామని, అందుకు డబ్బులివ్వాలని వారు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కోర్టుకెక్కిన షూటర్ వర్తికా సింగ్, ఫేక్ లెటర్ పంపి లంచం కోరారని ఆరోపణ, 2 న విచారణ

Edited By: Anil kumar poka

Updated on: Dec 26, 2020 | 8:37 AM

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పైన, ఆమె ఇద్దరు సన్నిహితులపైన షూటర్ వర్తికా  సింగ్ కోర్టుకెక్కింది. జాతీయ మహిళా కమిషన్ లో నిన్ను సభ్యురాలిని చేస్తామని, అందుకు డబ్బులివ్వాలని వారు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. దీనిపై సుల్తాన్ పూర్ కోర్టు జనవరి 2 న విచారణ జరపనుంది. స్మృతి ఇరానీకి సన్నిహితులైన విజయ్ గుప్తా, రజనీష్ సింగ్ అనే వ్యక్తులు తనకు మహిళా కమిషన్ లో ఈ పదవిని ఇస్తామని, ఇందుకు కోటి రూపాయలు డిమాండ్ చేశారని, చివరకు 25 లక్షలకు దిగివచ్చారని వర్తికా సింగ్ తెలిపింది. తనకు  ఓ ఫేక్ లెటర్ పంపారని కూడా ఆమె వెల్లడించింది. వీరిలో ఒకరు తన పేరు చెప్పకుండా ఫోన్ లో మాట్లాడినట్టు ఆమె పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను విజయ్ గుప్తా ఖండించాడు. వర్తికా సింగ్ పైనే అమేథీ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రతిష్టకు ఈమె  భంగం కలిగిస్తోందని ఆరోపించాడు. దీనిపై పోలీసులు ఈమెపై  ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.

మీ అవినీతిని బయటపెడతానని హెచ్చరించినందుకే ఆయన పోలీసులకు తనమీద ఫిర్యాదు చేశాడని వర్తికా సింగ్ అంటోంది. మరి ఈ పరస్పర ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం స్పందించలేదు.