వారెవ్వా, నభాలో మరో అద్భుత టాలెంట్

|

Oct 09, 2020 | 8:48 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి రైజ్‌లో ఉన్న హీారోయిన్ల లిస్టులో నభా నటేష్ ముందు వరసలో ఉంది. ప్రస్తుతం ఆమె యువ కథానాయకులకు బెస్ట్ ఆఫ్షన్‌గా మారింది‌.

వారెవ్వా, నభాలో మరో అద్భుత టాలెంట్
Follow us on

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి రైజ్‌లో ఉన్న హీారోయిన్ల లిస్టులో నభా నటేష్ ముందు వరసలో ఉంది. ప్రస్తుతం ఆమె యువ కథానాయకులకు బెస్ట్ ఆఫ్షన్‌గా మారింది‌. సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మడుకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. కాగా బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఎప్పుడో కానీ ఫ్రీ టైమ్ దొరకదు. ఆ సమయంలో తమ వ్యాపకాలపై ఫోకస్ పెడుతుంటుంది. తాజాగా న‌భా న‌టేశ్ కూడా త‌నలో ఉన్న చిత్ర‌కళ‌ను మొదటిసారి ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ చిత్రాల్లో అల‌రించే పాపుల‌ర్ రోల్ బ్యాట్ మ్యాన్ చిత్రాన్ని అద్బుతంగా వేసి ఔరా అనిపించింది.

“నేను చేసిన ప‌ని..న‌న్ను నిర్వ‌చిస్తుంది.  ఇది గీయ‌డానికి 6-7 సెష‌న్లు ప‌ట్టింది. పూర్త‌యే వ‌ర‌కు చాలా ఆనందంగా పెయింటింగ్ చేశా.  ఒక‌వేళ మీరు బ్యాట్ మ్యాన్ అభిమాని అయితే నేను గీసిన చిత్రాన్ని చూసి గ‌ర్వపడతారు” అని పేర్కొంది. న‌భా న‌టేశ్ ప్రజంట్ ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో న‌టిస్తోంది.

Also Read :

Bigg Boss Telugu 4: ఫన్‌లోనూ, పారితోషకంలోనూ ఇతడే టాప్ !

ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ

రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు