#IndiaVsAustralia2020 : రెట్రో జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా… కొత్త జెర్సీలో శిఖర్ ధావన్

|

Nov 24, 2020 | 6:15 PM

జెర్సీ వేసుకుని దిగిన ఫొటోను తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో ధావన్​ పంచుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో ఉన్న ధావన్​.. జెర్సీతో దిగిన ఫొటోను ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్​స్టాలో...

#IndiaVsAustralia2020 : రెట్రో జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా... కొత్త జెర్సీలో శిఖర్ ధావన్
Follow us on

New Retro Jersey : ఆసీస్ సిరీస్‌లో కొత్త జెర్సీతో భారత ఆటగాళ్లు మెరువనున్నారు. అయితే తాను జెర్సీ వేసుకుని దిగిన ఫొటోను తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో ధావన్​ పంచుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో ఉన్న ధావన్​.. జెర్సీతో దిగిన ఫొటోను ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. లుక్​ సూపర్​ ఉందని అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. 1992లో భారత ఆటగాళ్లు ఇలాంటి జెర్సీతోనే ప్రపంచకప్ బరిలో దిగారు. అదే తరహాలో ఈ జెర్సీ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

భారత్-ఆసీస్ మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది. మొత్తంగా తలో మూడు వన్డేలు, టీ20లు, నాలుగు టెస్టులు ఇరుజట్లు ఆడనున్నాయి.