
కృష్ణాజిల్లా పెడన మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెడన మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య పై సిబ్బంది దాడికి పాల్పడ్డారు. అంజయ్య ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తున్న సమయంలో పారిశుధ్య కార్మికులంతా కలిసి ఒక్కసారిగా దాడిచేశారు. లంకేశ్వరి అనే వర్కరును లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ సిబ్బంది అంతా అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పెడన పోలీసులకు మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై ఫిర్యాదు చేశారు పారిశుద్ధ్య కార్మికులు. అయితే, తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థంకాటంలేదని, వాకింగ్ కు వెళుతున్న తనపై ఉద్దేశపూర్వకంగా దాడిచేశారంటున్నారు కమిషనర్ అంజయ్య. తనపై వస్తోన్న ఆరోపణలను ఖండిస్తున్నారు. కాగా, జరిగిన వివాదాలపై పెడన పోలీసులు విచారణ ప్రారంభించారు.