కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం… కాలిబూడిదైన నివేదా పల్లిలోని మురికివాడ.. భారీగా అస్థినష్టం

|

Nov 14, 2020 | 10:18 PM

వెలుగులు నింపాల్సిన దీపావళి కోల్‌కతావాసులను చీకట్లోకి నెట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం... కాలిబూడిదైన నివేదా పల్లిలోని మురికివాడ.. భారీగా అస్థినష్టం
Follow us on

వెలుగులు నింపాల్సిన దీపావళి కోల్‌కతావాసులను చీకట్లోకి నెట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూసిటీలో చెలరేగిన మంటలు దాదాపు బస్తీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘోర అగ్నిప్రమాదం దీపావళి పండుగ రోజు జరగడంతో పరిసర ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతా న్యూ టౌన్‌లోని నివేదా పల్లిలోని మురికివాడ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో పలు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. బస్తీలో ఇళ్లన్నీ దగ్గర దగ్గర ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటార్పే ప్రయత్నం చేస్తున్నారు.

మంటలను అదుపు చేసేందుకు 5 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనలో భారీగా ఆస్థి, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. మరోవైపు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.