పైన సూర్యుడు ఎలా మండుతున్నాడో చూశారా?

| Edited By:

Jan 30, 2020 | 4:46 PM

చంద్రుడు ఎలా ఉంటాడో చూశాం.. అలాగే ఇతర గ్రహాలు కూడా ఎలా ఉంటాయో ఇప్పటికే.. నాసా ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ.. భగ భగ మండే సూర్యుడు మాత్రం ఎలా ఉంటాడో ఇప్పటి వరకూ మనం చూడలేదు. అసలు సూర్యుడిని చూడగలమా అనే సందేహం కూడా కలిగింది. ఎందుకంటే.. ఎంతో వేడిని కలిగి ఉంటాడు. ఆ వేడికి.. సూర్యుని దరి దాపుల్లోకి వెళ్లే.. ఎలాంటి ప్రయత్నమూ చేయలేక పోయాయి పరిశోధనా సంస్థలు. అయితే ఆ మండే అగ్ని […]

పైన సూర్యుడు ఎలా మండుతున్నాడో చూశారా?
Follow us on

చంద్రుడు ఎలా ఉంటాడో చూశాం.. అలాగే ఇతర గ్రహాలు కూడా ఎలా ఉంటాయో ఇప్పటికే.. నాసా ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ.. భగ భగ మండే సూర్యుడు మాత్రం ఎలా ఉంటాడో ఇప్పటి వరకూ మనం చూడలేదు. అసలు సూర్యుడిని చూడగలమా అనే సందేహం కూడా కలిగింది. ఎందుకంటే.. ఎంతో వేడిని కలిగి ఉంటాడు. ఆ వేడికి.. సూర్యుని దరి దాపుల్లోకి వెళ్లే.. ఎలాంటి ప్రయత్నమూ చేయలేక పోయాయి పరిశోధనా సంస్థలు. అయితే ఆ మండే అగ్ని గోళాన్ని ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్ టెలీస్కోప్ సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన తొలి చిత్రాన్ని తీసింది. నిజానికి మన సూర్యుడికి సంబంధించిన మొదటి చిత్రం ఇదే. దాదాపు కొన్ని వేళ్ల మైళ్ల నుంచి ఈ ఫొటో తీసినట్టు సమాచారం.

అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్‌ఎస్‌ఎఫ్) సంస్థ తమ పరిశోధనలో భాగంగా సూర్యుడి ఉపరితలం ఫొటోలు, వీడియోలను తీసింది. వీటిల్లో సూర్యుడు భగభగ మండుతూ.. బంగారు వర్ణంలో కనిపించాడు. ఈ ఫొటోలను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో కాసేపటికే ఇవి వైరల్‌గా మారాయి.