దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?

|

Aug 15, 2020 | 1:59 AM

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూల్స్, విద్యాసంస్థలను సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దశల వారీగా కేంద్రం తెరిచేందుకు సిద్దం అవుతోందని పలు వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.

దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?
Follow us on

Schools Not to Open Before December: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూల్స్, విద్యాసంస్థలను సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దశల వారీగా కేంద్రం తెరిచేందుకు సిద్దం అవుతోందని పలు వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి. ఇక ఇప్పుడు  డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసి ఉంచుతారని మరో వార్త వైరల్ గా మారింది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ట్విట్టర్ వేదికగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ).. ”సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. స్కూల్స్ రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి తేదీని నిర్ణయించలేదని” స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో అన్ లాక్ 3 నడుస్తోంది. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని చోట్లా షాప్స్, మాల్స్, రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. దీనితో స్కూల్స్ ను ఎప్పుడు తెరుస్తారన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నా.. కేంద్రం ఆమోదం లేకుండా అది జరగదన్న సంగతి తెలిసిందే.