తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులపై సుప్రీం సంచలన తీర్పు

| Edited By: Srinu

Jul 01, 2019 | 7:55 PM

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే ఫీజులు ఉండాలన్న సుప్రీం తేల్చి చెప్పింది. ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డ న్యాయస్థానం.. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. కాగా కాలేజీ ఫీజులు పెంచాలంటూ ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల పెంపును ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీని వలన విద్యార్థులపై […]

తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులపై సుప్రీం సంచలన తీర్పు
Follow us on

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే ఫీజులు ఉండాలన్న సుప్రీం తేల్చి చెప్పింది. ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డ న్యాయస్థానం.. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. కాగా కాలేజీ ఫీజులు పెంచాలంటూ ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల పెంపును ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీని వలన విద్యార్థులపై భారం పడుతున్న ఉద్దేశ్యంతో అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.