
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తూ వస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కరోనా కాలంలో లోన్ తీసుకుంటున్నవారికి మరింత ప్రయోజనం కలగనుంది.
ఎంసీఎల్ఆర్‌ను 5-10 బేసిక్ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ కొత్త రేట్లు జులై 10 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ఎంసీఎల్ఆర్‌ను స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తగ్గించడం ఇది వరుసగా 14వ సారి. తాజా సవరణతో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 6.65 శాతానికి తగ్గింది. జూన్ నెలలో బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్, ఈబీఆర్ రేట్లను 25 నుంచి 40 బేసిక్ పాయింట్ల వరకు తగ్గించింది. దీనితో ఎంసీఎల్ఆర్ సంవత్సరానికి 7 శాతానికి పడిపోయింది. అంతేకాకుండా రెపో రేటులో బ్యాంక్ మొత్తంగా 40 బేసిక్ పాయింట్ల కోత విధించిన సంగతి తెలిసిందే.
Tenor Existing MCLR (In %) Revised MCLR (In%)*
Overnight 6.7 6.65
One Month 6.7 6.65
Three Month 6.75 6.65
Six Month 6.95 6.95
One Year 7 7
Two Years 7.2 7.2
Three Years 7.3 7.3