మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు… పర్యావరణవేత్తల వార్నింగ్

పర్యావరణవేత్తలు హైదరాబాద్ నగర భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానగరంగా అభివృద్ధి చెందిందని ఆనందించడం కాదు.. నగరానికి జీవనాధారమైన మూసీ నదిని పరిరక్షించుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ప్రమాదం పొంచి వుందని హెచ్చరిస్తున్నారు.

మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు... పర్యావరణవేత్తల వార్నింగ్
Follow us

|

Updated on: Oct 18, 2020 | 3:17 PM

Save Moosi river save Hyderabad:  మూసీ నదిని పునరుద్ధరించడం ద్వారా దాన్ని పరిరక్షించకపోతే హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు వుండదని హెచ్చరిస్తున్నారు పర్యావరణ వేత్తలు. హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించే మూసీ రివర్‌లో వ్యర్థపదార్థాలు మరీ ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలను వదలడం ద్వారా నదిని పూర్తిగా నాశనం చేశారని వారు ఆరోపిస్తున్నారు. దానికి తోడు నగరంలో మూసీని ఆక్రమిస్తూ నిర్మాణాలు జరపడం కూడా ప్రమాద తీవ్రతను పెంచిందని వారు చెబుతున్నారు.

మూసీ రివర్‌పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసిన బీవీ సుబ్బారావు.. టీవీ9 ఛానల్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరూ అనుకుంటున్నట్లుగా మూసీ రివర్ వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద ఉద్భవించలేదని ఆయన చెబుతున్నారు. దామగుండం అనేది అనంతగిరి కంటే ఎత్తైన ప్రదేశమని, అక్కడే మూసీ, మూస నదులు ఉద్భవించాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని బ్రిటిష్ కాలంలోనే సర్వే ఆఫ్ ఇండియా ధ‌ృవీకరించిందని సుబ్బారావు వెల్లడించారు.

మూస, మూసీ నదులు కలిసి మూసీ నదిగా ప్రవహిస్తాయని, ఇవి రెండు హిమాయత్ సాగర్ లో కలుస్తాయని సుబ్బారావు తెలిపారు. మూస, మూసీలు కలిసి హైదరాబాద్ నగరంలో బాపు ఘాట్‌గా ఏర్పడ్డాయని తెలిపారు. సుమారు వంద ఏళ్ల తరువాత మూసీ వరదల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తోందని సుబ్బారావు చెబుతున్నారు. మూసీ నది చుట్టూ 50 శాతం పట్టణీకరణ వున్న నగరం హైదరాబాద్ ఒక్కటేనని, దామగుండం నుంచి కృష్ణా నదిలో మూసీ నది కలిసే వరకు నదిని పునరుద్ధరణ చేయాల్సి వుందని ఆయన సూచిస్తున్నారు.

మూసీ నదిని కలుషితం చేశారంటూ పారిశ్రామిక సంస్థలను నిందించడం సరికాదు కానీ.. ఫార్మా సిటీ కాల్ ఇండ్రస్టీగా హైదరాబాద్ నగరాన్ని మూసి నుండి రక్షించాల్సిన అవసరం ఉందని సుబ్బారావు అంటున్నారు. నదికి ఇరువైపులా వుండే వారు నదిలో చెత్తాచెదారాన్ని విసిరేయడం, అనేక వ్యర్థాలను.. ముఖ్యంగా రసాయనాలను నదిలో వదిలేయడం వల్ల నదీ జలాలు కలుషితం అవుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ భవిష్యత్తును కాపాడాలంటే మూసీ రివర్‌ను పునరుద్ధరించాల్సిందేనని సుబ్బారావు ప్రభుత్వానికి సూచించారు.

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు

Also read: దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్

Latest Articles