Saudi king receives first dose : సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిబ్ తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా.. సల్మాన్‌కు అక్కడి ఆరోగ్య మంత్రి తౌఫిక్ అల్-రబయా కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తోపాటు ఆయన సోదరుడు ఖలీద్ బిన్ సల్మాన్ సహా.. ఇతర సీనియర్ అధికారులు ఇప్పటికే టీకా తొలి మోతాదును తీసుకున్నవారిలో ఉన్నారు.
ఈ మేరకు.. గల్ఫ్ ప్రాంతంలో ఫైజర్ టీకా వినియోగాన్ని ఆమోదించిన రెండో దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. బహ్రెయిన్ ఈ జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకుంది.
అయితే.. సౌదీ వ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రతి దశలోనూ నిర్దిష్ట జనాభా ఆధారంగా టీకా పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం రియాద్, మక్కా, తూర్పు ప్రావిన్సులోని మూడు వ్యాక్సిన్ కేంద్రాలలో.. ఇప్పటివరకు లక్ష మందికిపైగా వ్యాక్సినేషన్ కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ