శారదా చిట్‌ ఫండ్‌ కేసులో రాజీవ్‌కుమార్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు

| Edited By:

May 26, 2019 | 9:35 PM

శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తూ.. సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సరం పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఇటీవల కోర్టు వెనక్కి తీసున్న కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై ఇటీవల సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును […]

శారదా చిట్‌ ఫండ్‌ కేసులో రాజీవ్‌కుమార్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు
Follow us on

శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తూ.. సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సరం పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఇటీవల కోర్టు వెనక్కి తీసున్న కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై ఇటీవల సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తునకు రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని, అంతేగాక సాక్ష్యాలను మరుగుపర్చేందుకు చూస్తున్నారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాజీవ్‌ కుమార్‌ విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది.