ద్రావిడ్‌పై శాంసన్ ప్రశంసలు…

|

Jun 24, 2020 | 3:16 PM

భారత లెజండరీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఓడిపోతున్న మ్యాచ్‌లను సైతం ఒంటిచేత్తో గెలిపించిన సమర్ధుడు.

ద్రావిడ్‌పై శాంసన్ ప్రశంసలు...
Follow us on

భారత లెజండరీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఓడిపోతున్న మ్యాచ్‌లను సైతం ఒంటిచేత్తో గెలిపించిన సమర్ధుడు రాహుల్ ద్రావిడ్. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తుండమే కాకుండా అండర్ 19, ఇండియా ఏ జట్లను మెంటర్‌గా పర్యవేక్షిస్తున్నాడు. పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్‌ గిల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు ద్రావిడ్ పర్యవేక్షణలోనే ఆరితేరారు.

తాజాగా రాహుల్ ద్రావిడ్‌పై యువ ఆటగాడు సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రావిడ్ తనకు ఎన్నో కొత్త టెక్నిక్స్ నేర్పించాడని శాంసన్ తెలిపాడు. అంతటి లెజండరీ ప్లేయర్ తనకు కోచ్‌గా రావడం అదృష్టమని చెప్పుకొచ్చాడు. 18 ఏళ్ల వయసులోనే గొప్ప ఆటగాడితో ప్రయాణించడం సంతోషంగా ఉందని ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వివరించాడు. గెలుపు ఓటములను ఎలా స్వీకరించాలో ద్రావిడ్ నుంచే నేర్చుకున్నానని.. ఆటను ఆస్వాదిస్తూ ఆడుతున్నానని శాంసన్ వెల్లడించాడు.