
Samatha Case Final Judgement: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సమత కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ప్రధాన నిందితుడైన షేక్ బాబుకు 376 డీ సెక్షన్ ప్రకారం శిక్షను ఖరారు చేసింది. అతడితో పాటు మరో ఇద్దరు దోషులైన షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్ధుంలకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసు ఫైనల్ జడ్జ్‌మెంట్ ఈ నెల 27న రావాల్సి ఉండగా.. న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా ఆలస్యమైన సంగతి విదితమే.
కాగా, గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే సమతపై ముగ్గురు మృగాళ్లు తెగబడ్డారు. అత్యంత దారుణంగా అత్యాచారం హత్య చేసి రాక్షసానందం పొందారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు నిమిత్తం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడంతో 20 రోజుల్లోనే పోలీసులు దర్యాప్తును పూర్తి చేశారు. ఇక నిందితులకు ఉరి శిక్ష ఖరారు కావడంతో గ్రామస్తులు, సమత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.