‘ఫిదా’ సినిమాతో అందరినీ ఫిదా చేసింది.. సాయి పల్లవి. తన డ్యాన్స్‌తో అందరి మైండ్ బ్లాంక్ చేస్తూ.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ జోరుగా దూసుకుపోతుంది. తాజాగా పల్లవి అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఫోర్బ్స్ జాబితా ‘ఇండియా 30 అండర్ 30’లో ప్లేస్ కొట్టేసింది. 30 సంవత్సరాలలోపు తమతమ రంగాల్లో విజయాలు సాధించిన 30 మంది జాబితాను ఫోర్బ్స్ ప్రతీ యేటా ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, డిజైన్, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, సైన్స్ రంగాలకు చెందిన యువతీ యువకులను ఎంపిక చేస్తారు.
అయితే 2020కి గానూ 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు సంపాదించుకుంది. విజయ్ తర్వాత సాయి పల్లవినే.. ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సినిమా ‘ప్రేమమ్’తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను సైతం ఫిదా చేసింది. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ.. ముందుకు దూసుకుపోతోంది. కాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో.. నాగచైతన్యతో ఓ లవ్ స్టోరీలో నటించింది. ఈ సినిమా విడుదలకు రెడీ ఉంది. అలాగే.. ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా ‘విరాట పర్వం’ తెరకెక్కుతోంది. ఇందులో పల్లవి కీలక పాత్ర పోషిస్తోంది.