బ్రేకింగ్: రైతు బంధు సాయం పెంచుతూ ఉత్తర్వులు

|

Jun 01, 2019 | 7:50 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎకరాకు ఇస్తున్న రూ. 4వేల సాయాన్ని రూ. 5వేలకు పెంచింది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం జీవోను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు అది ఐదు వేల రూపాయలకు చేరింది. వేసవి కాలం ముగుస్తూనే ఖరీఫ్ సీజన్ […]

బ్రేకింగ్: రైతు బంధు సాయం పెంచుతూ ఉత్తర్వులు
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎకరాకు ఇస్తున్న రూ. 4వేల సాయాన్ని రూ. 5వేలకు పెంచింది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం జీవోను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు అది ఐదు వేల రూపాయలకు చేరింది. వేసవి కాలం ముగుస్తూనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఆ మేరకు తెలంగాణ సర్కార్ అమలు చేయాల్సిన రైతు బంధు పథకం సాయం పెంపుపై నెలకొన్న నేటితో ఉత్కంఠకు తెరపడింది. గతంలో ఈ పథకం కింద రైతులకు ఎకరాకు నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇకపై ఐదు వేల రూపాయలను సాయంగా అందించనుంది.