అభిమానికి రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తాను కొట్టిన సిక్సర్ బంతి ఓ మహిళా అభిమానికి తగలడంతో మ్యాచ్ పూర్తైన తర్వాత ఆమె వద్దకు వెళ్లి ఎలా ఉందో తెలుసుకున్నాడు. ఆమెతో మాట్లాడి హ్యాట్ పై సంతకం చేసి ఇచ్చాడు. అంతేకాదు వారి కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. తాజాగా ఈ ఫోటోలను BCCI ట్విట్టర్ ద్వారా పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. హిట్ మ్యాన్ పై నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక, […]

అభిమానికి రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Edited By:

Updated on: Jul 03, 2019 | 1:23 PM

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తాను కొట్టిన సిక్సర్ బంతి ఓ మహిళా అభిమానికి తగలడంతో మ్యాచ్ పూర్తైన తర్వాత ఆమె వద్దకు వెళ్లి ఎలా ఉందో తెలుసుకున్నాడు. ఆమెతో మాట్లాడి హ్యాట్ పై సంతకం చేసి ఇచ్చాడు. అంతేకాదు వారి కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. తాజాగా ఈ ఫోటోలను BCCI ట్విట్టర్ ద్వారా పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. హిట్ మ్యాన్ పై నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తర్వాత ఒకే ప్రపంచ కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ వరల్డ్‌కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్‌ గత ప్రపంచకప్‌లో బంగ్లాపై ఒక సెంచరీ చేశాడు. దీంతో కలిపి రోహిత్‌ చేసిన మొత్తం శతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ విషయంలో 6 సెంచరీలు సాధించిన సచిన్‌ టెండూల్కర్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ నిలిచాడు.