మందుబాబులకు షాక్.. మరోసారి.. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు..

లాక్ డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలు తెరచిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచింది. దీనిపై జీవో జారీ చేసింది. పెంచిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి. రూ. 120 బ్రాండ్ మద్యంపై క్వార్టర్

మందుబాబులకు షాక్.. మరోసారి.. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు..

Updated on: May 05, 2020 | 2:12 PM

Liquor prices in AP: లాక్ డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలు తెరచిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచింది. దీనిపై జీవో జారీ చేసింది. పెంచిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి. రూ. 120 బ్రాండ్ మద్యంపై క్వార్టర్ కు రూ.40, హాఫ్ బాటిల్ పై రూ.80, ఫుల్ బాటిల్ పై రూ.160, మినీ బీర్లపై రూ.40, బీర్ బాటిల్ పై రూ.60 పెంచింది. రూ.120-రూ.150 ధరలు ఉన్న క్వార్టర్ పై రూ.80, హాఫ్ పై రూ.60, ఫుల్ పై రూ.320 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మాస్క్‌ లేకపోతే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ పేర్కొన్నారు.

Also Read: మందుబాబులకు షాక్మద్యంపై కరోనా సెస్… 70 శాతం..

 

Follow Us